దుమ్ములేపుతున్న భగవంత్ కేసరి ఫస్ట్ సింగల్ ప్రోమో..!!
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి. అఖండ, వీర సింహ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ వంటి సినిమాల తరువాత రాబోతున్న ఈ సినిమా పై అటు నందమూరి అభిమానులకే కాదు, ఇటు ఇండస్ట్రీలో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయ్..
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మోస్ట్ టాలెంటెడ్ ఎంగ్ డైనమిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయా తెరకెక్కించిన సినిమాలు ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. జంధ్యాల తరువాత, నేటి తరం దర్శకులలో, అంత కామెడీ పండిస్తున్న దర్శకులలో అనిల్ రావిపూడి ముందు వారసులో ఉంటాడు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి నటసింహం నందమూరి బాలకృష్ణ తో భగవంత్ కేసరి సినిమా తెరకెక్కిస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు శ్రీలీలే హీరోయిన్లుగా నటిస్తున్నారు.పెళ్లి చేసుకొని, ఓ బిడ్డకి జన్మనిచ్చిన తరువాత నరీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. అయితే ఈ సినిమాలో బాలయ్య మొదటిసారి తెలంగాణ మాండలికంలో మాట్లాడుతున్నారు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బాలయ్య గెట్ అప్ , చాల కొత్తగా ఉన్నాయి.
తాజాగా భగవంత్ కేసరి సినిమా నుండి అదిరిపోయే మొదటి పాట ప్రోమో వచ్చింది. ఈ పాటలో శ్రీలీలే , బాలకృష్ణ చాల అందంగా ఉన్నారు, చిచ్చా తీన్మార్ వెయ్ అని ఒక డైలాగుతో ఫ్యాన్స్ కి పూనకాలు వస్తున్నాయి. థమన్ మ్యూజిక్ మరోసారి మాస్ బీట్స్ తో దుమ్ములేపాడని సమాచారం.
