యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - కొరటాల శివ కాంబినేషన లో వచ్చిన సినిమా 'మిర్చి. రైటరగా కొరటాల శివ ఎన్నో సినిమాలకు పని చేసాడు , అంతే కాకుండా తాను ఎన్నో సినిమాలకు రచనా సహకారం , మరియు డైలాగ్స్ కూడా రాసారు . బృందావనం సినిమాలో తారక్ చెప్పిన డైలాగ్స్ అంత అద్భుతంగా వచ్చాయి అంటే దానికి కారణం కొరటాల శివ . మిర్చి సినిమా తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ లో కి పరిచయమయ్యాడు కొరటాల శివ . అప్పటివరకు రచయితగా ఉన్న కొరటాల శివ ను ప్రభాస్ మొదటి సారిగా డైరెక్టర్ గా అవకాశం ఇచ్చాడు . శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భారత్ అనే నేను ఇలా వరసగా స్టార్ హీరోలను డైరెక్ట్ చేశారు కొరటాల శివ.
భరత్ అనే నేను సినిమా తరువాత కొరటాల శివ చాల లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా వస్తుంది , ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యహరిస్తున్నారు. ప్రభాస్ కు హిట్ ఇచ్చిన కొరటాల శివ మల్లి ప్రభాస్ తో సినిమా చెయ్యాలనుకుంటూన్నాడు .కొరటాల శివ కాళీ సమయంలో ప్రభాస్ కు స్టోరీ రెడీ చేస్తున్నాడు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
తనకు మొదటి అవకాశం ఇచ్చిన ప్రభాస్ తో మల్లి సినిమా చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు , అని ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి . ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత కొత్త రకం కధలు వింటున్నాడు . ప్రభాస్ షూటింగ్ బ్రేక్ టైమ్ దొరికినప్పుడల్లా కొత్త కధలు వింటున్నాడు, అని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి తో సినిమా చేస్తున్నాడు, ఈ సినిమా కంప్లీట్ అయితే గాని తారక్ తో సినిమా చేస్తాడో , లేక ప్రభాస్ తో సినీమా చేస్తాడో ఒక క్లారిటీ రావాలి . కొరటాల శివ - ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా వస్తే ఫాన్స్ సంతోషపడతారు ,దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే కొంత కాలం ఆగాలసిందే .
