ఇస్మార్ట్ శంకర్ సినిమా తో హిట్ అందుకున్న రామ్ , ఆ తరువాత కిశోర్ తిరుమల డైరేక్షన్ లో మూవీ ఎనౌన్స్ చేసాడు . రామ్ , కిషోర్ తిరుమల కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాలు మూజికల్ గా హిట్ అయినాయి అంటే దానికి కారణం దేవిశ్రీప్రసాద్ .
పూరి -రామ్ కలయుక లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంగీతం అందిచాడు మణిశర్మ , ఈ సినిమా లో పాటలకు ప్రేక్షకులు బాగా కనక్ట్ అయ్యారు , అందుకనే మల్లి రామ్ మణిశర్మ కు అవకాశం ఇచ్చాడు అని ఫిల్మ్ నగర లో వార్తలు వినిపిస్తున్నాయి.
యువ హీరో రామ్ పోతినేని చాలా కాలం తరువాత ఒక ఫుల్ మాస్ స్టయిల్ లో తో సాలీడ్ హిట్ అందుకున్నాడు . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కెరీర్ లో బెస్ట్ సినిమా . గత కొన్నేళ్లుగా మంచి మ్యూజిక్ అందిస్తున్న మెలోడీ బ్రహ్మ మణిశర్మ వర్క్ చేసిన ఎ సినిమాలు కూడ సక్సెస్ కావడం లేదు, దీంతో తన కసి మొత్తాన్ని ఇస్మార్ట్ శంకర్ తో బయటపెట్టాడు. దాదాపు అన్ని పాటలు బెస్ట్ హిట్స్ అయి ప్రేక్షకులను అలరించినాయి .
యూట్యూబ్ లో మిలియన్ వ్యూవ్స్ తో దూసుకుపోతున్నాయ్ ,ఇస్మార్ట్ శంకర్ సినిమా సాంగ్స్ .అసలైతే దర్శకుడు కిషోర్ తిరుమల తాను చేసిన మొదటి మూడు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ నే తీసుకున్నాడు , కాని రామ్ కిశోర్ తిరుమల కు మణిశర్మ ను సజెస్ట్ చేసాడు, అందుకనే రామ్ మాటను కాదనలేక పోయాడు . కిషోర్ తిరుమల సినిమాకు మొదటి సారిగా మణిశర్మ పనిచేస్తున్నాడు , కాబట్టి సంగీతం ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా ఆగాల్సిందే .
