రవితేజ , గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా వస్తుంది అనగానే ప్రేక్షకులలో అంచనాలు భారిగా ఉంటాయి . రవితేజ లో ఉన్న కామిడీ యాంగిల్ ను బాగా ప్రెసెంట్ చెయ్యడంలో గోపీచంద్ మలినేని హిట్ అయ్యాడు అని చెప్పాలి , దీనికి ఉదాహరణ డాన్ శ్రీను , బలుపు సినిమాలు . మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న 66వ చిత్రాన్ని దీపావళి సందర్బంగా అనౌన్స్ చేసాడు . కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది డాన్‌శీను, బలుపు సినిమాల తర్వాత రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ చిత్రం ఇది , ఈ సినిమాకు ప్రేక్షకులలో అంచనాలు భారీ స్థాయీ లో ఉన్నాయి ..
గతంలో రవితేజ శ్రుతి హసన్ తో బలపు సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమాలో వీరి కలయుక్ లో వచ్చిన సీన్స్ ప్రేక్షకులందరిని బాగా అలరించినాయి . గోపీచంద్ మలినేని , రవితేజ డైరెక్షన లో వస్తున్న ఈ సినిమాలో ఈ సారి కూడా శ్రుతిహసన్ ని తీసుకుంటున్నారు చిత్ర యూనిట్ . వీరిద్దరి హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి . ఈ చిత్రానికి ,బి.మధు నిర్మాతగా వ్యహరిస్తున్నారు . నవంబర్‌లో ఈ సినిమాను గ్రాండ్‌గా ప్రారంభమైన ఈ సినిమా , అలాగే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన వివరాలను త్వరలోనే ప్రెస్ మీట్ లో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది .
