టాలీవుడ్ లో విభిన్నమైన సినిమా లు తీసే అతి కొద్ది మంది దర్శకులలో విక్రమ కుమార్ ఒకరు . తాను తీసే ప్రతి సినిమాలో కొత్తదనం ఉంటుంది అని ప్రేక్షకులు చెబుతుంటారు . నితిన్ కెరీర్ లో ఇష్క్ సినిమా చాలా పెద్ద విజయం సాదించింది అంటే , కేవలం విక్రమ కుమార్ సినిమాలో కనిపించే స్క్రీన్ ప్లే అని చెప్పొచు . విక్రమ కుమార్ తీసింది ,చాలా తక్కువ సినిమాలు అయిన ప్రేక్షకులలో మంచి పేరు తెచ్చుకున్నాడు అని చెప్పాలి . విక్రమ కుమార్ సినిమా అంటేనే ఎదో కొత్త పాయింట్ ఉంటుంది అని ప్రేక్షకులు బావిస్తారు . 13 బి సినిమా తో తెలుగు లో కి పరిచయమయ్యాడు విక్రమ కుమార్ , ఈ సినిమా ప్రేక్షకులను బాగా భయపెట్టింది . విక్రమ కుమార్ అక్కినేని కుటుంబం తో తీసిన మనం సినిమా చాలా పెద్ద విజయం సాదించింది.
మనం సినిమా విక్రమ కుమార్ కెరీర్ కు ఎంతో మంచి పేరును తీసుకొచ్చింది అని చెప్పాలి . 13బి , ఇష్క్ , మనం 24 చిత్రాలు తీసిన విక్రమ కుమార్ ప్రేక్షకులకు నా నుండి కొత్త రకమైన్ కధలు ఆశిస్తున్నారు ప్రేక్షకులు , దానికి తగట్టుగా నేను సెలెక్ట్ చేసుకునే సబ్జక్ట్స్ చాలా కొత్తగా ఉంటాయి అని అంటున్నాడు . విక్రమ కుమార్ నాని కాంబినేషన్ లో వచ్చిన సినిమా గ్యాంగ్ లీడర్, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ,మరియూ టీజర్ రిలీజ్ అయినప్పటినుంచి, ప్రేక్షకులలో అంచనాలు బాగా ఉన్నాయి , కానీ సినిమా అయితే అధ్బుతంగా ఉంది , నాని పెర్ఫార్మెన్స్ , కార్తికేయే నటన అధ్బుతం, కాని సినిమా మాత్రం బాక్స్ ఆఫిస్ కలేక్షన్స్ ను రాబట్టలేక పాయింది అని చెప్పాలి.
గ్యాంగ్ లీడర్ సినిమా తో నిరాశ పడిన విక్రమ కుమార్ , ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలి అని కసి మీద ఉన్నాడు . విక్రమ కుమార్ కొంత గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ కోసం ఒక మంచి కధను సిద్ధిం చేస్తున్నాడు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయీ. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ .ఆర్.ఆర్ మూవీ లో నటిస్తున్నాడు ఈ సినిమా పూర్తి అయ్యేవరకు ఎ సినిమా మొదలుపెట్టడు , కాని రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తరువాత ఎ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడో అన్న వార్తలు ఫిల్మ్ నగర్ లో బాగా వినిపిస్తున్నాయీ . రామ్ చరణ్ ఆర్ అర్ ఆర్ సినిమా పూర్తి అవ్వగానే చాలా మంది డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు ,ఈ లైన్ లో విక్రమ కుమార్ కూడా ఉన్నారు అని వార్తలు వినిపిస్తున్నాయీ ,దీని పై క్లారిటీ రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే .
