ఆర్ ఆర్ ఆర్ ఫోటో షేర్ చేసిన ఎన్టీఆర్ వైరల్


తెలుగు సినీ ప్రముఖులతో పాటు ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ సినిమా . ఈ సినిమా కి రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తున్నారు.బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, అలియా భట్ కూడా నటిస్తున్నారు.కాగా గత ఏడాది ప్రెస్సుమీట్ తరువాత మల్లి ఇప్పుడు వార్తలో నిల్చింది.

తాజాగా ఎన్టీఆర్ తన ట్విట్టర్లో ఆర్ ఆర్ ఆర్ సంబంధించి కొన్ని ఫొటోస్ షేర్ చేసారు. షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే నెట్టింట్లో వైరల్గా మారింది. ఆ ఫొటోలో ఎన్టీఆర్ రామ చరణ్, రాజమౌళి, అజయ్ దేవగన్ కలిసి గణతంత్రదినోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సినిమాలో కొమరం భీమా పాత్రలో ఎన్టీఆర్, అల్లూరిసీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు,. రామ్ చరణ్ కి జోడిగా అలియాభట్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ కి జోడిగా హాలీవుడ్ హెరాయిన్ నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.ఎం ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి కథ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమాను ఈ ఏడాది జులై లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. డి వీ వీ దానయ్య నిర్మిస్తున్నారు.